![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -453 లో..... చందుకి ఆక్సిడెంట్ చేసిన రౌడీ కనపడగానే ధీరజ్, నర్మద అతన్ని వెంబడిస్తారు. రౌడీని పట్టుకొని కొడుతుంటే ఎవరు చేయించారో చెప్తానని రౌడీ అంటాడు. భాగ్యం వాళ్ళు చేయించారని అతను చెప్పగానే ధీరజ్ వాళ్ళు షాక్ అవుతారు. ఇంత కుట్ర చేస్తారా.. ఇప్పుడే వాళ్ళ సంగతి చెప్దామని ప్రేమకి కాల్ చెయ్ అని నర్మద అనగానే ప్రేమకి కాల్ చేసి రప్పిస్తాడు.
మరొకవైపు ఆ రౌడీ గాడు మన పేరు చెప్పి ఉంటాడని భాగ్యం వాళ్లు టెన్షన్ పడుతారు. ఇదంతా మీ వల్లే అని భాగ్యం వాళ్లపై శ్రీవల్లి కోప్పడుతుంది. అప్పుడే ప్రేమ, ధీరజ్, నర్మద వాళ్ళ దగ్గరికి వస్తారు. కూతురు కాపురం కోసం వాళ్ళ కాళ్ళు పట్టుకొని అత్తింటికి పంపేవాళ్లని చూసాను కానీ ఇలా ప్రాణం తీసే వాళ్లని మిమ్మల్ని చూసానని నర్మద అనగానే భాగ్యం వాళ్ళు షాక్ అవుతారు. అంటే మేము ఏదో డమ్మీ ఆక్సిడెంట్ చేయిస్తే అల్లుడికి సేవలు చెయ్యడానికి కూతురిని తీసుకొని వెళ్తాడని ప్లాన్ చేసామని భాగ్యం అనగానే తన చెంప చెల్లుమనిపిస్తుంది నర్మద. నాది తప్పు చెల్లి.. మా అమ్మ మాటలు విని ఇలా చేసానని శ్రీవల్లి అనగానే తన చెంప చెల్లుమనిపిస్తుంది ప్రేమ. ఆ తర్వాత ఆనందరావుని ధీరజ్ కొడతాడు. మీరు పెళ్లి చెయ్యడానికి చేసిన మోసాలు అమూల్య విషయంలో చేసిన మోసం అంతా మావయ్య గారికి చెప్తామని నర్మద అంటుంది ముగ్గురు వెళ్లిపోతుంటే శ్రీవల్లి కళ్ళు తిరిగి కిందపడిపోతుంది.
అంతా యాక్టింగ్ అని అనుకుంటారు కానీ నిజంగానే వల్లి కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. వెంటనే హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అక్కడికి చందు వస్తాడు. వల్లి అక్క కళ్ళు తిరిగి పడిపోయిందని నర్మద చెప్తుంది. అదంతా యాక్టింగ్ అని చందు అంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి శ్రీవల్లి ప్రెగ్నెంట్ అని చెప్తుంది. దాంతో అందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. నర్మద, ప్రేమ ఇద్దరు వల్లికి కంగ్రాట్స్ చెప్తారు. చందు మాత్రం కోపంగా ఉంటాడు. తరువాయి భాగంలో వల్లి ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసి రామరాజు హ్యాపీగా ఫీల్ అవుతాడు. వల్లిని తీసుకొని వద్దాం పదా అని రామరాజు అంటుంటే అసలు వల్లి గురించి ఏం తెలుసని అని చందు అంటాడు. అప్పుడే వల్లిని తీసుకొని వేదవతి ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |